NTV Telugu Site icon

NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. సాధ్యమయ్యే పనేనా..?

Ntrneel

Ntrneel

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్‌ పను లు చివరి దశకు చేరుకున్నాయి.

Also Read : SSRMB : ‘మహేశ్’ పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేయనున్న రాజమౌళి.!

ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్-నీల్ యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ వార్ 2 కారణంగా ముందుగా అనుకున్న దానికంటే కాస్త లేట్‌గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఇప్పటి నుంచి చూస్తే  కేవలం 11 నెలల్లో ఎన్టీఆర్-నీల్ ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత తక్కువ వ్యవధిలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. అవసరమైతే మధ్యలో ఎన్టీఆర్ వార్ 2కు ఆగష్టులో ప్రమోషన్స్‌ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ సాధ్యమయ్యే పనేనా అని అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది.