NTV Telugu Site icon

NTR: అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం ఎన్టీఆరే

Ntr

Ntr

NTR: జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా విషయంలో అనుకోనేరు .. కాదు రాజకీయంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం ఎలక్షన్స్ వేడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కి అసలైన వారసుడు ఎన్టీఆర్ అంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటనే. కానీ, ఎన్టీఆర్ మాత్రం తాను ప్రస్తుతం సినిమాల మీదనే ఫోకస్ చేస్తున్నా అని, పాలిటిక్స్ కు రావాల్సిన సమయంలో వస్తాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అయిపోతే అభిమానులు ఊరుకుంటారా.. ? ఎప్పుడు టైమ్ దొరికితే అప్పుడు ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టిన ఒక ఫ్లెక్సీ రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తోంది. విషయం ఏంటంటే.. ఒంగోలు లో రాత్రికి రాత్రి ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యేక్షమయ్యి.. కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆరే.. నెక్స్ట్ సీఎం. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే… అంటూ క్యాప్షన్ పెట్టిన ఎన్టీఆర్ ఫోటోలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ నెట్టింట వైరల్ గా మారింది.

Prabhas: బావ.. అన్ని వుడ్స్ అయిపోయాయి.. ఇక హాలీవుడ్ కు ఎంట్రీ ఇద్దామా..?

ఇక ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతో పారు సైకిల్ గుర్తు కూడా ఉంది. ఒంగోలు లో జనాలు ఎక్కువగా తిరిగే ప్రతి చోట ఈ ఫ్లెక్సీలను పెట్టారు. అసలు ఈ ఫ్లెక్సీని పెట్టించింది ఎవరు.. ? టీడీపీ అభిమానినా.. ? ఎన్టీఆర్ అభిమానినా.. ? కావాలని పెట్టించారా.. ? వివాదాలు నెలకొల్పడానికి పెట్టించారా ? అనేది తెలియాల్సి ఉంది. నారా లోకేష్ యువగళం జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ ను సీన్ లోకి తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారా..? లేక మరేదైనా ప్లాన్ తోనే ఇలా చేస్తున్నారా.. ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫ్లెక్సీల విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం ఎన్టీఆరే అన్న క్యాప్షన్ అయితే సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం తారక్.. దేవర సినిమాలో నటిస్తున్నాడు.

Show comments