Site icon NTV Telugu

Mahesh NTR: ఏంది మావా.. ఎన్టీఆర్ ట్యాగ్‌ కాపీ కొట్టేశారు!

Mahesh Ntr

Mahesh Ntr

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఊర మాస్‌గా రాబోతున్నట్టు, జస్ట్ అలా మాస్ స్ట్రైక్ వీడియోని శాంపిల్‌గా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మాస్ లుక్, బీడి స్టైల్, ఆ స్వాగ్, తమన్ బీజీఎమ్.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది గుంటూరు కారం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా… ఈ సినిమాకు కాపీ క్యాట్ అనే ట్యాగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంది. ఇప్పటికే తమన్ ట్యూన్, బీజిఎం బీట్ కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ట్యాగ్‌ను కాపీ కొట్టేశారంటున్నారు.

సినిమా టైటిల్‌ను మరింత పవర్ ఫుల్ చేయాలంటే.. ట్యాగ్ లైన్‌ మరింత పవర్ ఫుల్‌గా ఉండాలి. సినిమాకు టైటిల్ లీడ్ ఇచ్చినా కథకు లీడ్ ఇచ్చేది మాత్రం ట్యాగ్ లైనే. గుంటూరు కారం టైటిల్‌కు తగ్గట్టే పర్ఫెక్ట్‌గా highly inflammable అనే ట్యాగ్ లైన్ పెట్టారు కానీ ఇది ఎన్టీఆర్ సినిమా ట్యాగ్ లైన్ కావడం విశేషం. కృష్ణవంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ సినిమాకు ఇదే ట్యాగ్ లైన్ ఉంది. ఇది మన మాటల మాంత్రికుడు తెలిసి పెట్టాడో.. తెలియక పెట్టాడో తెలియదు గానీ ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. ఏంది మావా.. మా హీరో ట్యాగ్‌ను వాడేశారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మొత్తంగా ఎన్టీఆర్ ట్యాగ్‌ను మహేష్ సినిమాకి కాపీ కొట్టారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇక హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version