Mahesh NTR: ఏంది మావా.. ఎన్టీఆర్ ట్యాగ్ కాపీ కొట్టేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఊర మాస్‌గా రాబోతున్నట్టు, జస్ట్ అలా మాస్ స్ట్రైక్ వీడియోని శాంపిల్‌గా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మాస్ లుక్, బీడి స్టైల్, ఆ స్వాగ్, తమన్ బీజీఎమ్.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది గుంటూరు కారం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా… ఈ సినిమాకు కాపీ క్యాట్ అనే ట్యాగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంది. ఇప్పటికే తమన్ ట్యూన్, బీజిఎం బీట్ కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ట్యాగ్‌ను కాపీ కొట్టేశారంటున్నారు.
సినిమా టైటిల్‌ను మరింత పవర్ ఫుల్ చేయాలంటే.. ట్యాగ్ లైన్ మరింత పవర్ ఫుల్‌గా ఉండాలి. సినిమాకు టైటిల్ లీడ్ ఇచ్చినా కథకు లీడ్ ఇచ్చేది మాత్రం ట్యాగ్ లైనే. గుంటూరు కారం టైటిల్‌కు తగ్గట్టే పర్ఫెక్ట్‌గా highly inflammable అనే ట్యాగ్ లైన్ పెట్టారు కానీ ఇది ఎన్టీఆర్ సినిమా ట్యాగ్ లైన్ కావడం విశేషం. కృష్ణవంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ సినిమాకు ఇదే ట్యాగ్ లైన్ ఉంది. ఇది మన మాటల మాంత్రికుడు తెలిసి పెట్టాడో.. తెలియక పెట్టాడో తెలియదు గానీ ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. ఏంది మావా.. మా హీరో ట్యాగ్‌ను వాడేశారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మొత్తంగా ఎన్టీఆర్ ట్యాగ్‌ను మహేష్ సినిమాకి కాపీ కొట్టారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇక హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
- Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
- OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
- Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
తాజావార్తలు
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!