యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్ది హిట్స్ కొట్టిన కొరటాల శివ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పాపులర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి చాలా కాలమే అవుతుంది కానీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట తప్ప ఇంకో అప్డేట్ బయటకి రాలేదు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక వార్త వినిపిస్తోంది… ఈ మూవీలో హీరోయిన్ గా ‘జాన్వీ కపూర్’ హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందనే రూమర్ స్ప్రెడ్ అయ్యింది. ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి కొంతమంది దీన్నో గాలి వార్తగానే చూస్తున్నారు. సాయి పల్లవి, కీర్తి సురేష్, అలియా భట్, కియారా అద్వాని, రష్మిక ఇలా ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల పేర్లు ‘ఎన్టీఆర్ 30’ హీరోయిన్స్ లిస్టులో వినిపించాయి. ఆ కేటగిరిలోనే జాన్వీ కపూర్ పేరు కూడా బయటకి వచ్చి ఉండొచ్చు అనేది కొందరి మాట. మరి జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పక్కన నటిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
హీరోయిన్ విషయంలోనే కాదు ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో నటించబోయే ఇతర మేజర్ క్యారెక్టర్స్ కూడా ఫైనల్ అయ్యాయనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కనిపించబోతున్నాడని, నెగటివ్ రోల్ లో ‘సైఫ్ అలీ ఖాన్’ నటిస్తున్నాడనేది ఆ వైరల్ అవుతున్న రూమర్ సారంశం. సైఫ్ ఇప్పటికే ప్రభాస్ కి అపోజిట్ గా ‘ఆదిపురుష్’ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మోహన్ లాల్, ఎన్టీఆర్ లు కలిసి కొరటాల శివ దర్శకత్వంలోనే ‘జనతా గ్యారేజ్’ సినిమా చేశారు కాబట్టి మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం లేదు. సో మోహన్ లాల్, ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో నటిస్తుండడం కూడా దాదాపు గాలి వార్తనే అయ్యి ఉండొచ్చు. ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకోని ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చే వరకు ‘ఎన్టీఆర్ 30’ [ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశమే కనిపించట్లేదు.
