RRR ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో ఎన్టీఆర్, చరణ్ చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాగిన సరదా సంభాషణలో స్టార్స్ ఇద్దరూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే కీరవాణి “మీరు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, నైట్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు. ఉదయం లేచేసరికి రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డీవీవీ దానయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ముందుగా దేన్నీ అటెండ్ అవుతారు ? అని తారక్ ను ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఠక్కున శ్రీవల్లి పేరు చెప్పారు. ‘అంటే తిడుతుందనా? అని కీరవాణి ప్రశ్నించగా… “కాదు మా అమ్మ తరువాత ఆమెనే అమ్మ అని పిలుస్తాను నేను… తిట్టడం అంటే నన్ను తిట్టే హక్కు ఇద్దరు ఆడవాళ్లకే ఉంది. వాళ్లిద్దరూ రమ గారు, శ్రీవల్లమ్మ… అమ్మ పెద్దగా తిట్టేది కాదు… కానీ ఈ మధ్య పెళ్ళాం ముందు తిట్టడం ఎందుకు అనేమో ఆ కాస్త కూడా మానేసింది” అని చెప్పుకొచ్చారు.
Read Also : RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
ఇక రామ్ చరణ్ ను కూడా ఇలాంటి ప్రశ్నే అడిగారు కీరవాణి. చిరంజీవి, ఉపాసన, కీరవాణి, న్యూజెర్సీ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కాల్స్ వస్తే ఒకేఒక్క కాల్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరికీ చేస్తారు ? అంటే… ముందుగా చిరంజీవి పేరు చెప్పిన చెర్రీ తరువాత రేర్ గా వచ్చే కాల్ కీరవాణిది కాబట్టి ఆయన కాల్ అటెండ్ చేస్తానని చెప్పుకొచ్చారు.
