NTV Telugu Site icon

RRR Press Meet : రాజమౌళిని విలన్ చేసేసిన ఎన్టీఆర్

RRR

RRR Press Meetలో రాజమౌళిని విలన్ ను చేసేశాడు ఎన్టీఆర్. అయితే అది సరదాకే అయినా ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు. అయితే నిజానికి కోవిడ్ ‘ఆర్ఆర్ఆర్’కు అసలు విలన్ గా మారిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సినిమా విడుదల తేదీని చాలాసార్లు మార్చాల్సి వచ్చింది రాజమౌళి అండ్ టీం.

Read Also : RRR Press Meet : ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఇది కాదట !!

ఇక ఈరోజు సాయంత్రం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. నిన్న దుబాయ్ ఈవెంట్ లో పాల్గొన్న ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇప్పుడు కర్ణాటకలో ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. మార్చ్ 25న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments