“ఆర్‌ఆర్‌ఆర్” చిత్ర బృందం విజువల్ స్పెక్టాకిల్ ట్రైలర్‌ను ఆవిష్కరించి ఈ సినిమా ప్రమోషన్‌లో దూకుడు పెంచింది. ఈ రోజు హైదరాబాద్‌లో టాలీవుడ్ మీడియాతో చిత్రబృందం ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియాకు దర్శకుడు రాజమౌళి, హీరోలు చరణ్, తారక్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా తారక్ కు మిమ్మల్ని “పులి భయపెట్టిందా… రాజమౌళి భయపెట్టాడా?” అంటూ ట్రైలర్ లో భీమ్, పులి మధ్య వచ్చే ఫైట్ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.
Read Also : వీళ్లిద్దరి వల్లే 25 రోజులు వేస్ట్… చెర్రీ, తారక్ పై రాజమౌళి కామెంట్స్
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ “ట్రైలర్ లో ఉన్న పులి ఆయనే. అలా గర్జిస్తూ ముందుకు వచ్చిన రాజమౌళినే. సరే నేనూ ఆ పరిచయస్థుడైన పులి కాబట్టి నేను కూడా ఒక అరుపు అరిచా.. ” అంటూ చమత్కరించారు. “కొమరం భీమ్ ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఇంకా లోతుగా వెళ్తే… ఆ గొండ్ల తెగలో పుట్టిన ఆయన ప్రవర్తన, నడక ఎలా ఉంటుంది ? అనే విషయాలను రాజమౌళి మాకు ఇంజెక్ట్ చేశారు. దర్శకుడి రాజమౌళి ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి ఆయన బాగా కష్టపడ్డారు. ప్రతి సినిమాకూ కష్టం ఉంటుంది. ఈ సినిమాకు ఇంకాస్త కష్టపడ్డాం” అని అన్నారు.
