NTV Telugu Site icon

NTR: ఎందుకన్నా అంత కోపం.. అడిగింది అప్డేటేగా

Ntr

Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తరువాత ఒక్క సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లింది లేదు. దీంతో ఎన్నోరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ పై, మేకర్స్ పై గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అందుకు చాలా కారణాలే ఉన్నా.. కనీసం ఏదో ఒక అప్డేట్ అయితే ఇవ్వమని అభిమానులు నిత్యం పోరు పెడుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో కొత్త పోస్టర్స్ తో ఊరట కలిగిస్తున్నారు కానీ.. షూటింగ్ మాత్రం మొదలు కాకపోవడంతో ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా అభిమానులు అన్నా.. అప్డేట్.. అన్నా .. అప్డేట్ అంటూ వెంటపడుతూనే ఉన్నారు. ఇక గతరాత్రి ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో సుమ- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సుమకు ఎన్టీఆర్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలోనే ఎన్టీఆర్ విషయంలో ఆమె కొద్దిగా చొరవ ఎక్కువ తీసుకొంటుంది.

RC 15: హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…

ఇక ఎన్టీఆర్ అభిమానులు అందరు ఎన్టీఆర్ 30 అప్డేట్ గురించి అడుగుతుండగా.. ఆమె స్టేజిపైన.. ఎన్టీఆర్ 30 అప్డేట్ గురించి తారక్ చెప్తాడు అంటూ మైక్ ఇచ్చేసింది. సుమ ఒక్కసారిగా ఆ మాట అనేసరికి ఎన్టీఆర్ కోపంతో ఒక చూపు చూసాడు. అది కోపమా.. చిరాకా..? అసహనమా.? అనేది ఎన్టీఆర్ కే తెలియాలి. వెంటనే మైక్ తీసుకున్న ఎన్టీఆర్.. వాళ్ళు అడగేలోపు నువ్వే హింట్ ఇచ్చేలా ఉన్నావ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత అప్డేట్ లు అడుగుతున్న ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ తనదైన రీతిలో సమాధానమిచ్చాడు. రోజుకో అప్డేట్ ఇవ్వడమంటే ఎవరికి కుదరదు .. ఏదైనా మంచి అప్డేట్ ఉంటే మా భార్యల కన్నా ముందు మీకే చెప్తాం అని చెప్పి ముగించాడు. ఇక్కడి వరకు బాగుంది.. ఈ మాట చెప్పడానికి అంత కోపం ఎందుకు బ్రో.. సుమక్కను చంపేస్తావా..? ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై మీమ్స్ వేసి మీమర్స్ అభిమానులను నవ్విస్తున్నారు.

Show comments