Site icon NTV Telugu

NTR: యుఎస్, యూకే అనే తేడా లేదు… ఆల్ సెంటర్స్ ని ఎన్టీఆర్ ఫాన్స్ కబ్జా

Ntr

Ntr

మే 20 వస్తుంది అంటేనే ఎన్టీఆర్ ఫాన్స్, తారక్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్స్ వేసుకోని రెడీగా ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లు అమలాపురం నుంచి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమయ్యింది. యుఎస్ లోని టైమ్స్ స్క్వేర్ లాంటి చోట ‘సింహాద్రి’ డిజిటల్ బ్యానర్ ని లాంచ్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్… సింహాద్రి రీరిలీజ్ స్పెషల్ షోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కెనడాలో అయితే ఫాన్స్ కార్స్ తో ర్యాలీ చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్ కటౌట్ పెట్టి హెలికాఫ్టర్ తో పూలాభిషేకం చేసారు. ఇదే గ్రాండ్ సెలబ్రేషన్ అనుకుంటే ‘యూకే’లో 30 అడుగుల బర్త్ డే విషెస్ బ్యానర్ లో ఫ్లైట్ తో ఎగరేశారు. “మాసు లందు మెల్బోర్న్ మాసు వేరయా, విశ్వదాబి రామ ఇది అంత మన తారక రాముడి పై ప్రేమ” అంటూ మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫాన్స్ నెవర్ బిఫోర్ సెలబ్రేషన్ కి రెడీ అయ్యారు.

హోర్డింగ్స్, కేక్ కట్టింగ్స్, బ్లడ్ డొనేషన్ కాంప్స్, కార్ ర్యాలీ లాంటి ఈవెంట్స్ తో ఎన్టీఆర్ బర్త్ డేని మెల్బోర్న్ ఫాన్స్ పండగలా చేసుకుంటున్నారు. ఓవర్సీస్ దాదాపు అన్ని సెంటర్స్ లో సింహాద్రి స్పెషల్ షోస్ ఈరోజు అర్ధరాత్రి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ షోస్ స్టార్ట్ అవ్వగానే ఫాన్స్ హంగామా పీక్స్ కి వెళ్లిపోతుంది. ఈ జోష్ ని ముందే మొదలుపెడుతూ ‘ఎన్టీఆర్ 30’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు సాయంత్రం 7కి బయటకి రానుంది. ఈ పోస్టర్ బయటకి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ 24 అవర్స్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఎన్టీఆర్ 30’ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కనిపించడం గ్యారెంటీ. 

 

Exit mobile version