NTV Telugu Site icon

NTR: ఇదిరా.. పండగ పోస్టర్ అంటే.. కళ్లు అన్ని అతడిపైనే

Ntr

Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. కుటుంబానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తాడు. ఇక ఎన్టీఆర్.. ఎప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడు. పండగలకో.. ఏదైనా ప్రత్యేక సందర్బాల్లోనే ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సైతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఎప్పుడో కానీ, ఈ కుటుంబం సోషల్ మీడియాలో కనిపించదు. లా కనిపించిన రోజు ట్రెండింగ్ గా మారుతుంది. ఇక తాజాగా దీపావళీ పండగ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబం అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది.

Diwali Posters: దీపాల పండగ.. కొత్త పోస్టర్స్ పై ఓ లుక్ వెయ్యండి

ఇక ఈ ఫొటోలో అందరి కళ్లు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ పైనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్. అభయ్ చాలా మెతక. అస్సలు మాట్లాడడు.. కానీ.. ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ చాలా అల్లరి. అతడి అల్లరిని భరించడం చాలా కష్టమని ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో భార్గవ్ కూడా అలాగే ఉంటాడు. అందుకే అభిమానుల కళ్లన్నీ భార్గవ్ మీదనే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్.. పండగ పోస్టర్ అంటే ఇది అని చెప్పుకొస్తున్నారు.

Show comments