ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి, తన యాక్టింగ్ స్కిల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరోసారి అదే రేంజ్ ఇంపాక్ట్ ని పాన్ ఇండియా మొత్తం చూపించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక పాన్ ఇండియా యాక్షన్ మూవీ ముందెన్నడూ జరగనంత వేగంగా దేవర షూటింగ్ జరుగుతోంది. దాదాపు ఏడాది పాటు ప్రీప్రొడక్షన్ కే సమయం కేటాయించిన కొరటాల శివ, ఆ ప్రీప్రొడక్షన్ టైం వేస్ట్ అవ్వలేదని నిరూపిస్తూ దేవర షూటింగ్ కి ఎక్కడా బ్రేక్ పడకుండా చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కూడా దేవర సినిమాకి కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ అయ్యి కనీసం సమ్మర్ బ్రేక్ ని కూడా తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నాడు. మార్చ్ నెలలో దేవర సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
శంషాబాద్ లో మొదలైన మొదటి షెడ్యూల్ మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగింది. సెకండ్ షెడ్యూల్ అయిదు రోజుల గ్యాప్ లోనే మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 19 వరకూ దేవర సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. మే 16 నుంచి 21 వరకు మూడో షెడ్యూల్, జూన్ 7 నుంచి 22 వరకు నాలుగో షెడ్యూల్ జరిగాయి. ఇప్పటివరకూ జరిగిన అన్ని షెడ్యూల్స్ లో నాలుగో షెడ్యూల్ అతిపెద్దది. ఈ షెడ్యూల్ లో సముద్రం సెటప్ లో హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేసాడు కొరటాల శివ. ఇదే స్పీడ్ లో దేవర షూటింగ్ జరిగితే ప్లాన్ చేసుకున్నట్లే నవంబర్ నాటికీ షూటింగ్ కంప్లీట్ అవ్వడం గ్యారెంటీ. దేవర కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్, వార్ 2 సినిమా కోసం ముంబై వెళ్లిపోనున్నాడు.