Site icon NTV Telugu

NTR: దేవర ఆగమనం…

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ రైటింగ్, వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ గేమ్ థ్రోన్స్ స్థాయిలో దేవర గ్రాఫిక్స్ ఉంటుందని చెప్పాడు. ఇదే సమయంలో దేవర గ్లిమ్ప్స్ రాబోతుందని కూడా హింట్ ఇచ్చాడు. దీంతో అలర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ రోజున దేవర అప్డేట్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేసారు.

అభిమానులకి సాలిడ్ కిక్ ఇస్తూ గ్లిమ్ప్స్ కన్నా ముందు గ్లిమ్ప్స్ అనౌన్స్మెంట్ డేట్ ఇస్తూ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేసారు, ఇందులో ఎన్టీఆర్ పడవ పైన నిలబడి ఉన్నాడు. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇస్తూ బయటకి వచ్చిన పోస్టర్ లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో ఇంటెన్స్ లుక్స్ తో పవర్ ఫుల్ గా ఉన్నాడు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ని ఇలాంటి లుక్ లో అయితే చూడలేదు. సముద్రం, అలలు, పడవలతో పోస్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. ఇక గ్లిమ్ప్స్ బయటకి వస్తే బాక్సాఫీస్ పై దేవర దండయాత్ర మొదలైపోయినట్లే. గ్లిమ్ప్స్ నుంచే దేవర ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వనున్నాయి. దేవర హైప్ మరింత పెరగాలి అంటే గ్లిమ్ప్స్ ని సూపర్బ్ గా కట్ చేయాలి. మరి కొరటాల శివ ఎలాంటి కట్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.

Exit mobile version