‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది.
ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక ఈ ఏర్పాట్లను తారక్, చరణ్ పరిశీలించినట్లు తెలుస్తోంది. అక్కడ చరణ్.. తారక్ కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ప్రీ రిలీజ్ వేడుకకు ముస్తాబుతున్న స్టేజ్ బ్యాక్ సైడ్ బ్రదర్స్ ఇద్దరు కూల్ గా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది రొమాన్స్ కాదు బ్రోమాన్స్ అని రాజమౌళి అన్నట్లుగా వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోందని అభిమానులు ఆనడం వ్యక్తం చేస్తున్నారు.
