Site icon NTV Telugu

ముంబైలో వాలిపోయిన ఎన్టీఆర్… పిక్స్ వైరల్

NTR

NTR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో మీడియాతో ప్రెస్ మీట్‌లను ప్లాన్ చేసింది.

Read Also : రౌద్రం… ర‌ణం…రుధిరం… రియ‌ల్ మ్యాజిక్ ఆఫ్ రాజ‌మౌళి!

ఈరోజు ముందుగా ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి, తరువాత హైదరాబాద్ లోనూ మీడియా సమావేశానికి హాజరు కానున్నారు చిత్రబృందం. దీంతో ‘ఆర్ఆర్ఆర్’లో భీమ్‌గా నటిస్తున్న తారక్ ఈ రోజు ఉదయం చాలా కూల్ డ్రెస్‌లో ఈ స్పెషల్ ఈవెంట్ కోసం ముంబైకి చేరుకున్నాడు. బ్లాక్ డ్రెస్ లో ఎన్టీఆర్ స్టైల్ గా కనిపించాడు. పిక్స్ లో ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా, సంతోషంగా కనిపిస్తున్నాడు. మిగతా టీమ్ అంతా అతి త్వరలో ఈవెంట్‌కు హాజరు కానున్నారు. ఈ ప్రెస్ మీట్స్ ముగిశాక చెన్నై, బెంగుళూరులో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేశారు మేకర్స్.

Exit mobile version