Vijaya Shanthi: తెలుగోడి ఆత్మ గౌరవం.. ఎన్టీఆర్. నేడు ఆయన వందవ జయంతి. దీంతో ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకుంటున్నారు. భాషాతో సంబంధం లేకుండా ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. తాజాగా రాములమ్మ విజయశాంతి సైతం .. ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక అరుదైన విషయాన్నీ తెలిపినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఎన్టీఆర్.. విజయశాంతికి క్షమాపణలు చెప్పారట. అది కూడా ఆమె ఇంటికి వెళ్లి మరీ క్షమించమని అడిగారట. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదట. అసలు ఆరోజు ఏం జరిగింది..? ఎందుకు ఎన్టీఆర్, విజయశాంతిని క్షమాపణ అడిగారు..? అంటే.. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో జయాలు ఉన్నట్టే .. మరెన్నో పరాజయాలు కూడా ఉన్నాయి. పరాజయం వచ్చినప్పుడల్లా ఆయన కృంగిపోకుండా కెరటంలా లేస్తూనే ఉన్నారు.
Keerthy Suresh: కీర్తి బాయ్ ఫ్రెండ్.. నాక్కూడా తెలుసు అన్న తండ్రి
ముఖ్యమంత్రి అయిన అనంతరం మళ్లీ 1990లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ఎన్టీఆర్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవి, విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఆ విష్యం తెలుసుకున్న విజయశాంతి ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్లిందట. అయితే అక్కడ వెలుతురు లేకపోవడం, ఎన్టీఆర్ బ్రహ్మర్షి వేషంలోనే ఉండడంతో ఆమె.. ఎన్టీఆర్ ను పోల్చుకోలేక వెనుతిరిగిందట. ఇక తరువాతి రోజు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. నేరుగా చెన్నైలో ఉన్న విజయశాంతి ఇంటికి వెళ్లారట. అయితే ఆరోజే ఆమె హైదరాబాద్ రావడంతో.. విజయశాంతి ఇంట్లో ఉన్న శ్రీనివాస ప్రసాద్ ను కలిసి.. ” పొరపాటు జరిగింది.. బిడ్డను క్షమించమని చెప్పండి.. ఆమె రాకను నేను చూసుకోలేదు. ” అని చెప్పి వచ్చేశారట. అయినా కూడా ఎన్టీఆర్ మనసు ఒప్పక.. విజయశాంతి షూటింగ్ చేస్తున్న వైజయంతి ఆఫీస్ కు కాల్ చేసి.. ఆమెతో మాట్లాడి.. సారీ అని చెప్పారట. ఈ విషయం ఇప్పటివరకు విజయశాంతి ఎక్కడ బయటపెట్టలేదు. ఇప్పటివరకు ఆమె ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు. ఇంతకాలం మనసులో దాచుకున్న ఈ సారీ స్టోరీని ఇన్నేళ్ల తరువాత తొలిసారి విజయశాంతి రివీల్ చేసింది.