Site icon NTV Telugu

NTR: ఎన్టీఆర్ ను బాలయ్య అవమానించాడంటూ అభిమానుల రచ్చ

Ntr

Ntr

NTR: నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయన రేంజ్ పెరిగిందనే చెప్పాలి. ఇక బయట ఎంత రేంజ్ పెరిగినా నందమూరి కుటుంబంలో మాత్రం తారక్ కు సరైన గుర్తింపు లేదని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం.. ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడు కాబట్టి. హరికృష్ణకు తారక్ అంటే ఎంతో ప్రేమ. అతడిని వదిలి ఎక్కడకువెళ్ళేవాడు కాదు. ఇక తండ్రి అంటే ఎన్టీఆర్ కు పంచ ప్రాణాలు. ఆయనతో పాటు తాతగారి వద్దకు వెళ్లి ఆడుకొనేవాడట. ఎన్టీఆర్ సైతం తారక్ ను మనవడిగా అంగీకరించి ఆయనలానే పైకి వస్తారని చెప్పేవారట. కానీ, నందమూరి బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ ను అస్సలు పట్టించుకోడని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ఇక తాజాగా తారకరత్న దశదిన కర్మ నిన్న ఫిల్మ్ నగర్ లో జరిగిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ.. ఎన్టీఆర్ ను అవమానించిడాని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరిని దగ్గరకు వెళ్లి పలకరించిన బాలయ్య.. ఎన్టీఆర్ ను మాత్రం అస్సలు పలకరించలేదని, కనిపించినా ముఖం తిప్పుకొని వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వీడియోలో బాలయ్య.. వచ్చిన వారందరిని పలకరిస్తున్నాడు. బాలయ్య వస్తున్నాడు అని ఎన్టీఆర్ నిలబడగా అతనిని పట్టించుకోకుండా బాలయ్య వెనుతిరిగాడు. దీంతో కనీసం పలకరించడానికి కూడా ఎవరు లేరు.. ఇన్నాళ్ళుగా అంతలా అవమానించినా ఆ నందమూరి కుటుంబంలో ఎలా బతుకుతున్నావు అన్నా.. అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు సపోర్ట్ గా రామ్ చరణ్ అభిమానులు కూడా నిలబడ్డారు. ఎన్టీఆర్ చాలా మంచోడు.. బాలయ్య ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version