NTV Telugu Site icon

NTR 30: పది రోజుల షెడ్యూల్.. వారం రోజుల్లో ఫస్ట్ లుక్…

Ntr 30

Ntr 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బిగ్గర్ వరల్డ్, బిగ్గర్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుంది అనే విషయాన్ని అనౌన్స్మెంట్ రోజే క్లియర్ గా చెప్పిన కొరటాల శివ, ఎన్టీఆర్ 30ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్లు జాన్వీ కపూర్ ని, సైఫ్ అలీ ఖాన్ ని కాస్ట్ ఇన్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కంప్లీట్ చేసింది. ఒక షెడ్యూల్ లో భారి యాక్షన్ ఎపిసోడ్, రామోజీ ఫిల్మ్ సిటీలో చేసిన సెకండ్ షెడ్యూల్ లో కబ్బడి ఎపిసోడ్ ని షూట్ చేశారు. ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ లో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మే 16 నుంచి స్టార్ట్ అవ్వనుంది. మే 16 నుంచి పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.

ఎన్టీఆర్ తో పాటు మెయిన్ కాస్ట్ అయిన జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు. అనౌన్స్మెంట్ నుంచి సెట్స్ పైకి వెళ్లడం వరకూ బాగానే టైం తీసుకున్న కొరటాల శివ అండ్ టీం, షూటింగ్ ని మాత్రం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తున్నాడు. అసలు రిలాక్స్ అవ్వకుండా, సమ్మర్ బ్రేక్ ఇవ్వకుండా ఎన్టీఆర్-కొరటాల శివలు షూటింగ్ చేసేస్తున్నారు. ఈ మూవీ నుంచి మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో బయటకి రానున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ మే 20 ఎప్పటికీ గుర్తుండి పోయేలా, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న వచ్చే సునామీకి హెచ్చరికలా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ ని ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

Show comments