SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి

Rajamouli

Rajamouli

భారతీయ చలనచిత్ర రంగాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి. తన సినీ ప్రయాణంలో ఎదుగుదలకు కారణమైన కీలక చిత్రాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన దర్శకత్వ ప్రయాణం గురించి రాజమౌళి మాట్లాడుతూ ‘నా రెండవ చిత్రం సింహాద్రి నన్ను చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘సింహాద్రి’ చిత్రం అప్పట్లో సృష్టించిన రికార్డులు తెచ్చిపెట్టిన విజయం మాస్ డైరెక్టర్‌గా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత రామ్ చరణ్‌ కథానాయకుడిగావిభిన్నమైన రీతిలో వేరే స్థాయిలో ఒక అత్యుత్తమ ఎపిక్ యాక్షన్ చిత్రాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో నేను మగధీర సినిమా చేశాను. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. ఈ సినిమా సాధించిన విజయం ఆ తర్వాత మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లను ధైర్యంగా చేపట్టడానికి నాకు కావాల్సిన విశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని ఇచ్చిందని’ అన్నారు.

 అలాగే  మీరు ఎప్పుడూ యాక్షన్ సినిమాలు తీయాలనే అనుకునేవారా? ఈ జానర్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించే అంశం ఏమిటనే ప్రశ్నకు సమాధానమిస్తూ “యాక్షన్ సినిమాల్లో ఉండే అద్భుతమైన ఫాంటసీ ధోరణి నన్ను బాగా ఆకర్షిస్తుంది. మన నిజ జీవితంలో రోజూ చూసే సాధారణ విషయాలను వెండితెరపై మళ్లీ చూడటం నాకు పెద్దగా నచ్చదు. నేను ధియేటర్‌కి వెళ్లి డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నప్పుడు.. నా రియల్ లైఫ్‌లో ఎప్పటికీ జరగని, వాస్తవ ప్రపంచానికి పూర్తి అతీతంగా ఉండే ఒక సరికొత్త లోకాన్ని చూడాలనుకుంటాను. అందుకే నేను అలాంటి సినిమాలే తీస్తానని అన్నారు.