SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర రంగాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి. తన సినీ ప్రయాణంలో ఎదుగుదలకు కారణమైన కీలక చిత్రాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన దర్శకత్వ ప్రయాణం గురించి రాజమౌళి మాట్లాడుతూ ‘నా రెండవ చిత్రం సింహాద్రి నన్ను చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘సింహాద్రి’ చిత్రం అప్పట్లో సృష్టించిన రికార్డులు తెచ్చిపెట్టిన విజయం మాస్ డైరెక్టర్‌గా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత రామ్ చరణ్ కథానాయకుడిగావిభిన్నమైన రీతిలో వేరే స్థాయిలో ఒక అత్యుత్తమ ఎపిక్ యాక్షన్ చిత్రాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో నేను మగధీర సినిమా చేశాను. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. ఈ సినిమా సాధించిన విజయం ఆ తర్వాత మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లను ధైర్యంగా చేపట్టడానికి నాకు కావాల్సిన విశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని ఇచ్చిందని’ అన్నారు.
Also Read
- Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
- Cocktail 2 OTT Release: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్, షాహిద్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ చూడవచ్చు
- Viswanath & Sons: 'అల వైకుంఠపురములో' రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్మెంట్!
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
అలాగే మీరు ఎప్పుడూ యాక్షన్ సినిమాలు తీయాలనే అనుకునేవారా? ఈ జానర్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించే అంశం ఏమిటనే ప్రశ్నకు సమాధానమిస్తూ “యాక్షన్ సినిమాల్లో ఉండే అద్భుతమైన ఫాంటసీ ధోరణి నన్ను బాగా ఆకర్షిస్తుంది. మన నిజ జీవితంలో రోజూ చూసే సాధారణ విషయాలను వెండితెరపై మళ్లీ చూడటం నాకు పెద్దగా నచ్చదు. నేను ధియేటర్‌కి వెళ్లి డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నప్పుడు.. నా రియల్ లైఫ్‌లో ఎప్పటికీ జరగని, వాస్తవ ప్రపంచానికి పూర్తి అతీతంగా ఉండే ఒక సరికొత్త లోకాన్ని చూడాలనుకుంటాను. అందుకే నేను అలాంటి సినిమాలే తీస్తానని అన్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!