పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… ఈ జనరేషన్ లో స్టార్ హీరోకి అందనంత ఎత్తులో ఉన్నాడు. హ్యూజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ ఇండియన్ హీరోగా నిలిచాడు. అలాంటి ప్రభాస్, మూడు సినిమాతోనే రాజమౌళి రికార్డులని బ్రేక్ చేసి, రాజమౌళి తర్వాత ఆ రేంజ్ దర్శకుడు అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. గ్లిమ్ప్స్ రిలీజ్ కే 24 గంటల్లో ఆడియన్స్ 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ పై ఇండియాలో ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ ఫస్ట్ ఇండియన్ మూవీ ప్రమోషన్స్ విషయంలో కొంతమంది అప్సెట్ గా ఉన్నారు. మరో 40 రోజుల్లో రిలీజ్ పెట్టుకోని ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వేకప్ సలార్ టీం అంటూ ట్రెండ్ కూడా చేస్తున్నారు.
ఇలాంటి వాళ్లు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభాస్ అనే హీరో తనకి టైలర్ మేడ్ మాస్ రోల్ లో సినిమా చేస్తున్నాడు అంటే రాజు యుద్ధం చేయడానికి యుద్ధభూమిలో దిగినట్లే. వార్ ఎలా చేయాలో రాజుకి ప్రత్యేకించి నేర్పించాలా? అవసరమే లేదు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రభాస్ కి తోడుగా ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా జస్ట్ సలార్ టీజర్ అండ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తే చాలు ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ. KGF, కాంతారా లాంటి సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబలే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి సలార్ ప్రమోషన్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.
ఫేస్ కూడా రివీల్ చేయకుండా గ్లిమ్ప్స్ డిజిటల్ రికార్డ్స్ ని చెల్లాచెదురు చేసింది అంటే ప్రభాస్ గన్ను పట్టుకోని ఫైరింగ్ చేస్తే బాక్సాఫీస్ రికార్డులు మిగులుతాయా? ఫ్లాప్ సినిమాతోనే 500 కోట్లు రాబడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ సినిమా కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు లెక్క వెయ్యి కోట్ల నుంచి మొదలవుతుంది. ఆగస్టు నెలలో ఒక్క ప్రమోషనల్ కంటెంట్ రాకపోయినా, ట్రైలర్ అనౌన్స్మెంట్ లేకపోయినా సరే సెప్టెంబర్ నెల ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకూ సలార్ సోషల్ మీడియాలో కమ్మేయడం గ్యారెంటీ, ఆ తర్వాత బాక్సాఫీస్ ని కూడా సలార్ కబ్జా చేస్తాడు. ఈ విషయంలో డౌట్ ఉన్న వాళ్లు సెప్టెంబర్ 28 వరకూ వెయిట్ చేస్తే చాలు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది.
