No OTT offers for The Kerala Story: సుదీప్తో సేన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ థియేటర్లలో విడుదలైనప్పుడు అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. అయితేనేం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే, ఈ వివాదాస్పద బ్లాక్‌బస్టర్ సినిమాను కొనేందుకు అసలు ఏ ఒక్క ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆఫర్లు రావడం లేదట, దీంతో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ సమయంలో అనేక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ఇప్పటికే భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. అయితే మీడియాతో జరిగిన తాజా ఇంటరాక్షన్‌లో, కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రం OTT స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉందనే వార్తలను త్రోసిపుచ్చారు.
Chitragupta Temple: 450 ఏళ్ళ గుడి..ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలు అన్నీ మటుమాయం?
ఇప్పటికీ ఏ OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి మంచి ఆఫర్‌లు రాలేదని, తమ సినిమా ఇంత పెద్ద బాక్సాఫీస్ విజయాన్ని సాధించడం వల్ల సినీ పరిశ్రమ తమను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు. సుదీప్తో సేన్ మాట్లాడుతూ, మా బాక్సాఫీస్ విజయం చిత్ర పరిశ్రమలోని అనేక వర్గాలను కలవరపరిచింది, మా విజయం కోసం మమ్మల్ని శిక్షించడానికి ఇండస్ట్రీలోని ఒక విభాగం ఏకమైందని మేము భావిస్తున్నామని అన్నారు. కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద 230 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కేరళ స్టోరీ 2023లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఆదాశర్మ, యోగితా బిహానీ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కేరళలో జరుగుతున్న మతమార్పిడులను టార్గెట్ గా చేసుకుని తెరకెక్కించారు.