NTV Telugu Site icon

Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?

Kajal

Kajal

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ వేడుకలో అసలు కాజల్ ఊసే లేదు.

Read Also : Acharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా?

వేదికపై మాట్లాడిన చిరు కానీ, చెర్రీ కానీ, డైరెక్టర్ కొరటాల, నిర్మాతలు… ఇలా ఒక్కటి నోటి వెంట కూడా కాజల్ పేరు వినిపించలేదు. దీంతో ‘ఆచార్య’లో నుంచి కాజల్ సీన్లను కట్ చేశారని, అందుకే కాజల్ ను పక్కన పెట్టేశారంటూ వచ్చిన రూమర్స్ నిజమేననిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే కాజల్ అసలు సినిమాలో కనిపించే అవకాశం ఉందా ? అనే అనుమానం వస్తోంది. చిరంజీవి పూజాహెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నవ్వు బాగుంటుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కానీ కాజల్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సినిమాలో విలన్ గా నటించిన సోనూసూద్ పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. కాగా ‘ఆచార్య’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.