NTV Telugu Site icon

Leo: లియో సినిమా కోసం ఏ డిస్ట్రిబ్యూటర్ చేయని పని చేసాడు…

Leo

Leo

లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ‘లియో’. మాస్టర్ తో మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చేలా కొట్టాలనే ప్లాన్ చేసిన లోకేష్, లియో సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ కి టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. అక్టోబర్ 19న లియో సినిమా ఓపెనింగ్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని యూకేలో అహింస ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏ డిస్ట్రిబ్యూటర్ చేయని పనిని అహింస ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. యుకేలో రిలీజ్ అయ్యే వర్షన్ ని ఎలాంటి కట్స్ లేకుండా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్చేసింది.

లోకేష్ కనగరాజ్ విజువల్స్ లో ఒక్క ఫ్రేమ్ కూడా కట్ అవ్వకుండా కంప్లీట్ సినిమాని ఆడియన్స్ చూడాలి అందుకే ఎలాంటి కట్స్ కి వెళ్లకుండా రిలీజ్ చేస్తున్నాం అని అహింస ఎంటర్టైన్మెంట్ అనౌన్స్ చేసింది. లియో సినిమా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయిన తర్వాతే సెన్సార్ కి వెళ్లి 12A సర్టిఫికెట్ తెచ్చుకుంటాం అప్పటివరకూ A సర్టిఫికెట్ తో అడల్ట్స్ సినిమాగానే లియో ఉంటుంది. ఈ కారణంగా యుకేలో 18+ వాళ్లు మాత్రమే లియో సినిమాని చూడాల్సి ఉంటుంది. ప్రపంచమంతా సెన్సార్ కట్స్ ఉన్నా యుకేలో లియో లోకేష్ చూపించాలనుకున్న వర్షన్ రిలీజ్ అవుతుంది. ఇది బిగ్గెస్ట్ రిస్క్ అనే చెప్పాలి, లోకేష్ కనగరాజ్ విజన్ ని ఆడియన్స్ ని చూపించాలి అనే ఆలోచనతో అహింస ఎంటర్టైన్మెంట్ చాలా గట్స్ తో ఈ నిర్ణయం తీసుకుంది.