35 Chinna Katha Kadhu: ఇదో మా సిన్న కుటుంబం తొలి సూపు అంటూన్న నివేదా థామస్..
- ఇదో మా సిన్న కుటుంబం తొలి సూపు అంటూన్న నివేదా థామస్
- రానా దగ్గుబాటి సమర్పణలో "35- చిన్న కథ కాదు"
- తల్లి చెప్పే మాటలను విని జీవిత పాఠాలను ఎలా నేర్చుకుంటాడనే కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nivetha Thomas Upcoming Film: మలయాళీ బ్యూటీ నివేదా థామస్ ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ‘జెంటిల్ మెన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నివేదా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తక్కువ సినిమాలే చేసినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నివేదా ప్రధాన పాత్రలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో “35- చిన్న కథ కాదు” అనే సినిమాను డైరెక్టర్ నంద కిషోర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ”ఇదో, మా సిన్న కుటుంబం తొలి సూపు” అంటూ ఈ మూవీలోని మెయిన్ క్యాస్టింగ్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నేడు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read: Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!
Also Read
ఈ సినిమాలో ప్రియదర్శి, విశ్వ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ’35- చిన్న కథ కాదు’ ఈ సినిమా ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లల మధ్య సంఘర్షణ, ప్రేమ, అనురాగంతో కూడిన కథతో రూపొందబోతోంది. ఇద్దరు పిల్లల్లో ఒకడు చాలా తెలివైన వాడు. కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తాడు. అదే సమయంలో తన ఫ్యామిలీ ఎదుర్కొంటున్న సమస్యల నడుమ నలిగిపోతాడు. మరో కుర్రాడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఇష్టపడడు. మ్యాథ్స్ ను లాజిక్ లెస్ సబ్జెక్టుగా భావిస్తాడు. మ్యాథ్స్ ఫండమెంట్స్ తప్పంటూ స్కూల్ కు వెళ్లడు. తల్లి చెప్పే మాటలను విని జీవిత పాఠాలను ఎలా నేర్చుకుంటాడనే కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!