సౌత్ లో మంచి నటనా ప్రతిభ ఉన్న నటీమణులలో నివేదా థామస్ కూడా ఒకరు. ఇప్పుడు నివేదా సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది. నిన్ను కోరి, జై లవ కూడా, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ తాజాగా ఓ అరుదైన ఫీట్ ను సాధించింది. ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం ‘కిలిమంజారో’ను అధిరోహించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం కూడా. ఈ సూపర్ ఉమెన్ కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత దిగిన ఫోటోను షేర్ చేస్తూ తాను సాధించానని సంతోషం వ్యక్తం చేసింది. ఆ ఫోటో, ఆమె పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా నివేదాను అభినందిస్తున్నారు. నిజానికి చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఇలాంటి ఫీట్లు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అలాంటి అరుదైన నటీమణుల్లో నివేదా ఒకరు.
Read Also : ప్రభాస్ కు సినీ ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు
మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కూడా ఇలాంటి పనులు చేయడానికి, సాధారణ పనులు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అజిత్ ప్రొఫెషనల్ బైక్ రేసర్, షూటర్ కూడా. ప్రస్తుతం ఆయన ప్రపంచ పర్యటనలో ఉన్నాడు. కేవలం బైక్ పై తనకు నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
