Site icon NTV Telugu

Niveda Pethuraj : టాలీవుడ్‌లో మరో బ్రేక్ అప్.. ఎంగేజ్‌మెంట్ పోస్ట్ డిలీట్ చేసిన హీరోయిన్

Niveda Pethuraj Engagement

Niveda Pethuraj Engagement

ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. వివాహ అందాలకన్నా.. బ్రేకప్ న్యూస్ లు ఎక్కువయ్యాయి. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు నివేదా పేతురాజ్ కూడా చేరిపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల ప్రకటించిన నిశ్చితార్థంపై ఇప్పుడు సడెన్‌గా పెద్ద చర్చ మెదలైంది. రెండు నెలల క్రితం, నివేదా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘టు మై నౌ అండ్ ఫరెవర్‌’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో, ఆమె దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్ రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో పెళ్లికి రెడీ అవుతున్నట్టు అంతా అనుకున్నారు. అయితే, తాజాగా నివేదా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుంచి ఆ ఎంగేజ్‌మెంట్ పోస్ట్‌ను పూర్తిగా తొలగించేసింది. అంతేకాదు, ఆమె, రాజ్‌హిత్ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో, నిశ్చితార్థం రద్దైపోయిందనే గుసగుసలు ఇండస్ట్రీలో విపరీతంగా వినిపిస్తున్నాయి.

Also Read :NBK 111: మ్యూజిక్ వర్క్ షురూ.. థమన్ అప్‌డేట్‌తో బాలయ్య ఫ్యాన్స్‌లో డబుల్ హైప్!

సెలబ్రిటీల విషయంలో ఇలా జరగడం కొత్తేమీ కాకపోయినా, ‘ఫరెవర్‌’ అని చెప్పిన బంధం ఇంత త్వరగా ముగియడం ఆమె ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయదని అనుకున్న టైమ్‌లో, ఈ బ్రేకప్ వార్తతో నివేదా మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంపై నివేదా పేతురాజ్ కానీ, రాజ్‌హిత్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో జరిగిన ఈ మార్పులు చూస్తుంటే మాత్రం.. వారిద్దరూ విడిపోయారనే వార్త నిజమే అనిపిస్తుంది. త్వరలోనే దీనిపై ఆమె స్పష్టత ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version