Site icon NTV Telugu

Nithya Menen : ఆ హీరో నన్ను లైంగికంగా వేధించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నిత్యా మీనన్..!!

Whatsapp Image 2023 06 15 At 10.36.31 Am

Whatsapp Image 2023 06 15 At 10.36.31 Am

నిత్యా మీనన్.. ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది.. తనకు నటనతో పాటు తనలో మరో టాలెంట్ కూడా ఉంది అదే సింగింగ్.కొన్ని సినిమా ల్లో పాటలు కూడా పాడింది ఈ ముద్దుగుమ్మ . తెలుగు మరియు మళయాళంతో పాటు తమిళ్‌లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా లో కూడా చేసింది. ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది.. ఈ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది నిత్యామీనన్ ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్ట్స్‌తో ఎంతో బిజీగా ఉంది ఈ అమ్మడు.. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జ్ గా కూడా ఆమె వ్యవహరించింది.

ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి. ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎంతో మంది క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన సంగతి తెలిసిందే చాలా మంది హీరోయిన్ లు మీడియా ముందు కు వచ్చి పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అను భవాలను చెప్పుకొచ్చారు .తాజాగా నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇక ఈ అమ్మడు పెళ్లి గురించి కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.ఆ వార్తల పై కూడా నిత్యామీనన్ స్పందించింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. లైంగికం గా వేదించే వారు అన్నిరంగాల్లో వుంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. కానీ తమిళంలో మాత్రం ఓ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కున్నాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు అని ఆమె చెప్పుకొచ్చింది. నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ చాలా నీచంగా ప్రవర్తించాడు అని కూడా తెలిపింది. నిత్య చేసిన కామెంట్స్ ఇప్పుడుబాగా వైరల్ గా మారాయి.

Exit mobile version