NTV Telugu Site icon

Nitya Menen: ఛీ..నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. స్టార్ హీరో వేధింపుల రూమర్స్ పై నిత్యా క్లారిటీ

Menen

Menen

Nitya Menen: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అక్టోబర్ 6 న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్యా బిజీగా ఉంది. అందులో భాగంగానే నిత్యా.. ఒక కోలీవుడ్ స్టార్ హీరో తనను వేధించాడు అని చెప్పినట్టు వార్తలు రావడంతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఆ స్టార్ హీరో ఎవరు.. ? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఒక ఫేమస్ వెబ్ సైట్.. నిత్యాను ఇంటర్వ్యూ చేస్తే.. అందులో ఆమె స్టార్ హీరో గురించి చెప్పిందని తెలుపడంతో.. చాలామంది అది నిజమే అని నమ్మారు. అంతేకాకుండా ఆ స్టార్ హీరో అతనే అంటూ పేర్లు కూడా జోడించి విమర్శలు మొదలుపెట్టారు. ఇక ఇంత జరుగుతుండడంతో ఒక జర్నలిస్ట్.. ఇదే విషయాన్ని నిత్యాకు తెలిపాడు. ఆమె ఈ విషయమై ఫైర్ అయ్యింది. అందులో ఎటువంటి నిజం లేదని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

“ఫాల్స్ న్యూస్.. ఇది అస్సలు నిజం కాదు. నేనే ఎవరికి ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒకవేళ ఈ రూమర్ ను ఎవరు స్ప్రెడ్ చేసారో తెలిస్తే .. నాకు చెప్పండి నేను ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎవరైనా ఈ రూమర్ గురించి చెప్తే.. దయచేసి అడ్డుకోండి. కేవలం క్లిక్‌లను పొందడం కోసం ఈ రకమైన తప్పుడు వార్తలను రూపొందించి ప్రజలను ఆకర్షితులను చేయాల్సిన అవసరం ఏముంది.. దయచేసి ఈ రూమర్స్ ను నమ్మకండి” అంటూ నిత్యా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ రూమర్ స్ప్రెడ్ చేసిన వెబ్ సైట్ ను కనుక్కొని వాటికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.