NTV Telugu Site icon

Nithiin: త్రిషకు సపోర్ట్ గా నితిన్.. నీచమైన వారికి సమాజంలో స్థానం లేదు

Nithin

Nithin

Nithiin: ఇండస్ట్రీ .. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతమంది విమర్శకులు ఉంటారో.. అంతే సపోర్ట్ గా నిలిచేవారు ఉంటారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ కు ఇబ్బంది వచ్చింది అంటే ప్రతి ఒక్క నటుడు ముందు ఉండి ఆమెకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఈ మధ్య రష్మిక విషయంలో జరిగిన డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. ఇక తాజాగా ఒక నటుడు.. ఏ హీరోయిన్ పై చేయని ఘాటు విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. తెలుగు, తమిళ్ భాషల్లో విలన్ గా ఎన్నో మంచి చిత్రాల్లో నటించిన మన్సూర్ అలీఖాన్ .. ఈ మధ్యనే లియో సినిమాలో నటించి మెప్పించాడు. ఇక ఇతని నటన గురించి పక్కన పెడితే.. బయట బిహేవియర్ చాలా వరస్ట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో వివాదాల్లో అతడు పేరు ఉంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిషతో కలిసి స్క్రీన్‌పై నటించకపోవటంపై నిరాశను వ్యక్తం చేశాడు. అది కూడా బెడ్ రూమ్, అత్యాచార సన్నివేశాన్ని మిస్ అయ్యాను అంటూ చెప్పడంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇండస్ట్రీ ఖండించింది.

ఇప్పటికే మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై త్రిష స్పందించింది. “నీచమైన, అసహ్యకరమైన సదరు కామెంట్స్ స్త్రీలపై చులకన భావాన్ని కలుగచేసేలా ఉన్నాయి.లియో సినిమాలోని మన్సూర్‌తో కలిసి నటించకపోవడం సంతోషం. ఆయనతో కలిసి భవిష్యత్తులోనూ నటించను. మన్సూర్ వంటి వ్యక్తుల వల్ల మానవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని” ఆమె తెలిపింది. ఇక త్రిషకు సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్, మాళవికా మోహనన్, సింగర్ చిన్మయి, మంజిమ మోహన్ సహ పలువురు నటీనటులు మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హీరో నితిన్ సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించాడు. హీరోయిన్ త్రిషకు తన మద్దతుని తెలియజేశాడు.

” మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ యొక్క నీచమైన మరియు అసభ్యకరమైన ప్రకటనను నేనుతీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సమాజంలో, సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారానికి తావు లేదు. స్త్రీలపై ఇలాంటి ఇబ్బందికరమైన, స్త్రీ ద్వేష పూరిత కామెంట్స్ చేసే వారికి వ్యతిరేకంగా సమాజం, సినీ ఇండస్ట్రీ ఉండాలని, మన పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను” అని అన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నితిన్, త్రిష కలిసి అల్లరి బుల్లోడు సినిమాలో నటించారు.