NTV Telugu Site icon

Nithin: టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. శ్రీలీలే దిక్కంటున్న నితిన్

Nithin

Nithin

Nithin says tollywood is with deficit of heroines: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకు మాత్రం ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఇక అతని ఆశలన్నీ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇక తాజా విషయం ఏంటంటే.. వెంకీ కుడుములతో నితిన్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భీష్మ సినిమా తర్వాత ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మిక మందన్నా అనుకున్నారు. భీష్మ కాంబో మరోసారి రిపీట్ అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?

ఏమైందో తెలియదు.. రష్మిక తప్పుకున్నట్లు వార్తలు రాగా.. ఆ మధ్య నితిన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాలో రష్మిక నటించడం లేదని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన నితిన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక వెంకీ కుడుముల సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. శ్రీలీలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని వెల్లడించారు. తన రెండు సినిమాల్లోనూ శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. నితిన్ వ్యాఖ్యలతో శ్రీ లీల తన లక్కీ ఛార్మ్ గా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి శ్రీ లీల.. నితిన్ పాలిట లక్కీ ఛార్మ్ అవుతుందో లేదో. ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాను నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Show comments