Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..

Thammudu Nithin

Thammudu Nithin

టాలీవుడ్​లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో  కాంతార న‌టి స‌ప్త‌మి గౌడ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నేడు స‌ప్త‌మి బ‌ర్త్‌డే కావ‌డంతో ఆమెకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు.

Also Read : #NBK 111 : మాస్ దేవుడు తిరిగొచ్చాడు..ఈ సారి మరింత గట్టిగా గర్జిస్తాం

ఈ లుక్‌లో సప్తమి లంగ జాకెట్ ధరించి .. పల్లెటూరి అమ్మాయిల అమాయకంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుందట. అందుకే ఆ రోల్ కి సప్తమి అయితే న్యాయం చేయగలరని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే ఈ సినిమాను మొదట 2025 జూలై 4న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విజయ్ దేవరకొండ ‘కింగ్‌ డమ్’ కోసం వాయిదా వేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ‘తమ్ముడు’ నిర్మాతలు జూలై 25న విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.