Site icon NTV Telugu

లాంఛనంగా నితిన్ కొత్త సినిమా ప్రారంభం

Nithiin31 launched with a formal Pooja ceremony

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. వినాయక చవితి శుభ ముహూర్తాన సినిమాను ప్రారంభించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం, ప్రసాద్ మురెల్లా కెమెరా విభాగాలను చూసుకుంటారు. ఈ సినిమా అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది.

Read Also : తండ్రి కాబోతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్

“నితిన్31” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి అనిల్ రావిపూడి, అల్లు అరవింద్, వెంకీ కుడుముల, మేర్లపాక గాంధీ, బివిఎస్ఎన్ ప్రసాద్, ఠాగూర్ మధు అతిథులుగా హాజరయ్యారు. వెంకీ కుడుముల సినిమా స్క్రిప్ట్‌ను బృందానికి అందజేసి ప్రొసీడింగ్స్ ప్రారంభించాడు. మొదటి షాట్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నిర్మాత రామ్ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మొదటి షాట్ కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రం మాస్ టైటిల్‌ కూడా మాస్ గానే ఉండబోతోందట. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు మోషన్ పోస్టర్ ద్వారా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు.

Exit mobile version