టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. టాలెంటెడ్ హీరో నితిన్, ఆఫియా జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రాబోయే సోమవారం నాడు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ అయిన ‘యూనానిమస్’ (uNANImous Productions) పై నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలను ప్రోత్సహించే నాని నిర్మాణంలో నితిన్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ఫ్యాాన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడింది. సోమవారం జరిగే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలు సహా ఇతర విశేషాలు స్పష్టంగా తెలియనున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి!

