Macherla Niyojakavargam నుంచి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. కొన్ని రోజుల క్రితం ‘మాస్ట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు Macherla Niyojakavargamతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. పొలిటికల్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కేథరిన్ ట్రెసా ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి నితిన్ మరో అప్డేట్ ను ఇచ్చారు.
Read Also : RRR : ఈ హీరోలకు ఛాన్స్ మిస్… రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Macherla Niyojakavargam నుంచి ఈ మార్చ్ 26 న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి నితిన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసినట్టు ప్రెస్ నోట్ తో రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా నితిన్ కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
