Nithiin: మాచర్ల నియోజకవర్గం సినిమా తరువాత నితిన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మాచర్ల నియోజక వర్గం గతేడాది రిలీజ్ అయ్యి నితిన్ కు భారీ పరాజయాన్ని ఇచ్చింది. దీంతో ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వడానికి నితిన్ కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోని నితిన్ తన 32వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నితిన్ తన సొంత బానరైన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నితిన్ 32 సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అని టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా డిసెంబర్ 23న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
Jabardasth Varsha: అతడు లేకపోతే చచ్చిపోదాం అనుకున్నా..
ఇక పోస్టర్లో నితిన్ రెండు గెటప్స్ లో కనిపించాడు. ఒకటి ఫుల్ గడ్డంతో రగ్గడ్ లుక్ లో సీరియస్ గా కనిపించగా.. ఇంకొకటి గాగుల్స్ పెట్టుకొని అల్ట్రా స్టైలిష్ లుక్ లో చాలా కూల్ గా కనిపించాడు. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ లో అభినయ్, పిఆర్ఓ మాట్లాడుకున్న సంభాషణను రాసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. అంటే ఇందులో నితిన్ అభినయ్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రతి ఆర్డినరీ మ్యాన్ వెనుక.. ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ స్టోరీ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ను మీకు పరిచయం చేస్తున్నాం.. ఎక్కువ ప్రేమను, వినోదాన్ని మీకు పరిచయం చేయడానికి మేము వేచి ఉండలేకపోతున్నాం” అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. ఇక అంతా బావుంది కానీ, ఫస్ట్ లుక్ మాత్రం ఎడిట్ చేసినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు. ఆ లుక్ ఏందీ బ్రో..?.. ఏ కాలంలో ఉన్నారు.. ? ఎడిట్ చేసి వదిలేస్తున్నారా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి.