Robinhood : నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెండీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేస్తుండటంతో క్రేజ్ పెరుగుతోంది. అయితే మూవీ ప్రమోషన్లు చాలా డిఫరెట్ గా చేస్తున్నారు. తాజాగా మూవీలో కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ తో నితిన్ ఓ రాపిడ్ ఫైర్ లాంటి ఫన్నీ ప్రోగ్రామ్ చేశారు. ఇందులో వెన్నెల కిషోర్ ను కొన్ని ప్రశ్నలు వేశాడు నితిన్. మీరు ప్రమోషన్స్ కు ఎందుకు రారు అని ప్రశ్నించాడు. దానికి కిషోర్ స్పందిస్తూ.. కమెడియన్లు నెలకు ఆరు సినిమాలు చేస్తారు. కానీ హీరోలు ఆరు నెలలకు ఒక్క సినిమానే చేస్తారు. కాబట్టి మీరు ప్రమోషన్లకు రావాలి మేం కాదు అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు కిషోర్.
Read Also : Kubera: ‘కుబేర’ ముగించిన నాగార్జున.. మరో స్లమ్ డాగ్ మిలియనీర్!
మరి ప్రమోషన్లకు డబ్బులు ఇస్తే వస్తారా అని నితిన్ అడుగుతాడు. దానికి వెన్నెల కిషోర్ ‘డబ్బుతో నన్ను మీరు కొనలేరు’ అంటూ క్రేజీ ఆన్సర్ ఇవ్వడంతో ఇద్దరూ నవ్వేసుకున్నారు. ఇలా ఈ ప్రోగ్రామ్ ఫన్నీ ప్రశ్నలు, క్రేజీ ఆన్సర్లతో సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబిన్ హుడ్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. నాలుగు సినిమాలు థియేటర్లలో పోటీ పడుతున్నాయి. అన్నీ మంచి హైప్ ఉన్న సినిమాలే. మ్యాడ్ స్వ్కేర్, రాబిన్ హుడ్, ఎల్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ రాబోతున్నాయి. మరి భారీ పోటీ నడుమ నితిన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో అనేది వేచి చూడాల్సిందే. నితిన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు.