Sai Pallavi: ఈమె సీత అయితే.. అంతకుముందు సీతగా చేసినవారిని మర్చిపోవచ్చు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి తర్వాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ పవర్ స్టార్ గా మారింది. ముఖ్యంగా నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆమె అభిమానులకు దగ్గర అయింది. వరుస సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న సాయిపల్లవి ప్రస్తుతం శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయిపల్లవి నటిస్తుందని వార్తలు వచ్చాయి.ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కాకుండా మరో పాన్ ఇండియా సినిమాలో సాయిపల్లవి నటిస్తుందని వార్తలు వైరల్ గా మారాయి. అదేంటంటే బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణంలో సాయిపల్లవి సీతగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
Prabhas: రేయ్.. రేయ్.. ఎవర్రా ఆ పిల్ల.. ప్రభాస్ నే చెంప మీద కొట్టి అట్టా పారిపోయింది..
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ఇప్పటికే బాలీవుడ్ లో ఆదిపురుష్ సినీరంతో ఈ ఏడాది ఒక రామాయణం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. దీంతో మరో రామాయణం తెరకెక్కించే పనిలో ఉన్నారంట బాలీవుడ్ మేకర్స్. ఇక ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ కనిపించనుండగా.. రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. సీతగా సాయిపల్లవి పర్ఫెక్ట్ అని భావించిన మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. మొదటినుంచి కూడా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటున్న సాయిపల్లవి రామాయణంలో సీత పాత్ర ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో తెలియంది కాదు. అందుకే ఈ కథను ఆమె వెంటనే ఒప్పుకుందని తెలుస్తుంది. సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే ఆమె.. ఇక సీతగా కనిపిస్తే మాత్రం అభిమానులు హారతులు పడతారు అనే విషయం చెప్పనవసరం లేదు. ఈ విషయం తెలియడంతో ఆమె ఫాన్స్.. ఈమె కనుక సీత అయితే అంతకుముందు సీతగా చేసిన వారిని మర్చిపోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అని తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!