బాలీవుడ్ టీవీ నటి నిషా రావల్ తన భర్త, నటుడు కరణ్ మెహ్రాతో గతేడాది విడిపోయిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఆమె భర్తపై మీడియా ముందు సంచల ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు మాజీ భర్త దారుణాలను బయటపెట్టింది. ఇటీవల ఆమె కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో కి వెళ్ళింది. అక్కడ తన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
” మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు కరణ్, పాయల్ రాస్తోంగి తో సీక్రెట్ గా మాట్లాడుకోవడం విన్నాను. వెంటనే అతడిని నిలదీసి అడిగాను. కరణ్ .. అవును మేము ప్రేమలో ఉన్నాం.. 6 నెలలుగా సీక్రెట్ రిలేషన్ లో ఉన్నామని చెప్పుకొచ్చాడు. నా హృదయం ముక్కలైపోయింది. ఏంటి ఇది అని ప్రశ్నించినందుకు అతడు నన్ను శారీరకంగా, బౌతికంగా హింసించాడు. ముంబైలో నన్ను ఒంటరిగా వదిలి బాబుతో వెళ్ళిపోయాడు. నరకం అనుభవించాను.. ఆ దెబ్బలతో బయటికొస్తే మీడియా నన్ను డ్రామా నటి అని ముద్ర వేసింది. కెచప్ రాసుకొని షో చేస్తుందని చెప్పుకొచ్చింది” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.
