NTV Telugu Site icon

Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?

Spy Nikhil Siddarth

Spy Nikhil Siddarth

Nikhil Siddharth’s ‘Spy’ release in trouble: అర్జున్ సురవరం, కార్తికేయ 2 వంటి సినిమాలతో హిట్లు కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ 18 పేజెస్ సినిమా నిరాశ పరిచినా ప్యాన్ ఇండియా క్రేజ్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అనే అంశం మీద వారంతా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన స్పై అనే ఒక ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ ను కె. రాజశేఖర్ రెడ్డి రాసిన కథను ఆధారంగా చేసుకుని గ్యారీ బిహెచ్ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ , ఐశ్వర్య మీనన్ , ఆర్యన్ రాజేష్ , సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం సహా మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలలో నటించారు.

Also Read: Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?

వాస్తవానికి ఈ సినిమా ప్రకటించిన దాని మేరకు అయితే జూన్ 29న విడుదల కావాల్సి ఉంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా హీరో నిఖిల్ సిద్ధార్థ్ అట్టహాసంగా చేశారు. అయితే, ఇప్పుడు ఆయనే రిలీజ్ డేట్ మార్చమని నిర్మాతను అభ్యర్థిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతోంది. దానికి కూడా బలమైన కారణం ఉందని అంటున్నారు. అదేమంటే రిలీజ్ కు ఇంకా 20 రోజులు లేదు, అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప్ర‌మోష‌న్ బ‌జ్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ సినిమా కధ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించినది కాబట్టి అన్ని బాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు, ఈ క్రమంలో అన్ని భాషల్లో సినిమా ప్రమోషన్‌కు ఈ తక్కువ సమయం సరిపోదని నిఖిల్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాత మీద ప్రెజర్ తీసుకు వస్తున్నాడని తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ ప్రకటించి అన్ని అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు విడుదల తేదీని మార్చడం కరెక్ట్ కాదని నిర్మాత కె.రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారట.

Also Read: AAA Cinemas: అల్లు అర్జున్ థియేటర్ లాంఛ్ ఆ రోజే.. ఎవరి చేతుల మీదుగా అంటే?

నిజానికి నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా OTT హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. నిజానికి, నిర్మాత ఓటీటీ రైట్స్ ద్వారా చాలా వరకు ప్రొడక్షన్ ఖర్చులను రికవరీ చేసేశారు. అయితే ఇప్పుడు విడుదల తేదీని వెనక్కి జరిపితే సదరు OTT కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరిస్తుందని నిర్మాత భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్ మాత్రం సినిమా రిలీజ్ వాయిదా వేసి ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సినిమాను ప్రమోట్ చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో విడుదల తేదీ విషయంలో నిర్మాత, నిఖిల్ సిద్ధార్థ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే రిలీజ్ డేట్ వివాదంలో ఉందని, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద సందిగ్ధత ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

Show comments