Site icon NTV Telugu

Spy Release Date: నిఖిల్ చేత కూడా చెప్పించేశారు.. 29నే వరల్డ్ వైడ్ రిలీజ్

Spy Movie Release Date

Spy Movie Release Date

Nikhil Siddhartha Shares Spy Movie Release Date: యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న “స్పై” సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత రాజశేఖర్ రెడ్డి కథ అందించడం గమనార్హం. రెండవ ప్రపంచ యుద్దంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షాలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్ఫూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మిస్ అయ్యారు. ఆ తరువాత ఇండియన్ హిస్టరీలో సుభాష్ చంద్రబోస్ మిస్ అయినట్టు అయింది.
Vishaka Murder: విశాఖ జిల్లాలో దారుణం.. ఫోన్‌చేసి పిలిచి మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేశాడు!
ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే ఉంది, ఆయన మరణం గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి కథలో దాగి ఉన్న అనేక రహస్యాలను ఎంతో రీసెర్చ్ చేసి “స్పై” సినిమా కథగా మలిచారు నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి. ఇక ఇదే కథను అంతే ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా తెరకెక్కించారు దర్శకుడు గ్యారీ బీహెచ్, ఇక నిజానికి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం,కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లో “జూన్ 29” న గ్రాండ్ గా విడుదలకు రంగం సిద్దం అయింది అయింది అంటూ నిర్మాత తరపున నిన్న అధికారిక ప్రకటన వచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి నిర్మాతకు, హీరో నిఖిల్ కు మధ్య గాప్ ఉందని, నిఖిల్ సినిమా రిలీజ్ వాయిదా వేయమని కోరుతున్నాడని ప్రచారం జరిగింది. ఇక ఆ పుకార్లకు కూడా తెరదించుతూ సినిమా అదే రోజూ రిలీజ్ అవుతోందని నిఖిల్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Exit mobile version