Spy Glimpse: అదరహో అనిపించిన నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స్పై’ ఒకటి. ‘కార్తికేయ 2’ తర్వాత ఇది అతని రెండో పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా అవతారమెత్తుతున్నాడు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా ఎడ్ ఎంటర్టైన్మెంట్స్‌పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది. థీమ్‌కి తగినట్టుగానే ఈ వీడియో మెప్పించిందని చెప్పుకోవచ్చు.
చేతిలో ట్రాన్స్‌మిటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తున్న హీరో.. ఫైనల్‌గా ఆయుధాలతో నిండి ఉన్న ఓ ప్రదేశాన్ని కనుగొంటాడు. అనంతరం బైక్ నడుపుతూ, శతృవుల్ని ఛేజ్ చేస్తూ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో మెరిశాడు. చూస్తుంటే.. ‘జేమ్స్ బాండ్’ తరహాలో ఓ సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ టీజర్‌లో నిఖిల్ మునుపెన్నడూ లేని విధంగా స్లిక్, స్టైలిష్, డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న ఆర్యన్ రాజేష్.. ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
ఐశ్వర్య మీనన్ కథానాయికగా.. సాన్యా ఠాకూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా, హాలీవుడ్ డిఓపి జూలియన్ అమరు ఎస్ట్రాడా కెమెరా డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటుండగా.. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్, రాబర్ట్ లీనెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!