యంగ్ హీరో నిఖిల్ పై హైదరాబాద్ కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో యువ నటుడు నిఖిల్ కొన్ని దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అవసరమైన వారికి ఇతర వైద్య పరికరాలను, సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కోవిడ్ కష్ట కాలంలో బాధితులను ఆదుకోవడానికి తనవంతుగా నిఖిల్ చేసిన ప్రయత్నాలను గుర్తించారు పోలీసు కమిషనర్, విసి సజ్జనార్. నిన్న ఆయన నిఖిల్‌ను సత్కరించారు. అనంతరం సజ్జనార్ నిఖిల్‌తో సరదాగా సంభాషించారు. కష్టకాలంలో ఆయన చేసిన పనులు, సహాయాన్ని ప్రశంసించారు. నిఖిల్ ను సజ్జనార్ సత్కరిస్తున్న ఫోటోలు సోషల్ మిడిల్ హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు.
Read Also : పవన్, రానా మూవీ టైటిల్ ఇదే !
ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న “కార్తికేయ 2” సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అంతకుముందు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతోంది. మరోవైపు ఆయన నటిస్తున్న “18 పేజెస్” సినిమా చిత్రీకరణను పూర్తి చేసి డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది.