Karthikeya 2: హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నిఖిల్ సిద్దార్థ్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వంత కష్టంతో తనకంటూ ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ హీరో నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లను అందుకొంటుంది. ఇక ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక్క లెక్క అన్న చందాన నిఖిల్ కెరీర్ ఉండబోతుంది అని అభిమానులు అంటున్నారు. అయితే ఈ సక్సెస్ తానకు ముందుగానే దొరికిఉండేదేమో.. అప్పట్లో తనకు చెప్పేవారు లేకపోవడం వలనే ఆలస్యం అయ్యిందని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు.
“కార్తికేయ సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేను ఇక్కడ వరకు రావడమే విశేషం. కార్తికేయ 2 కలక్షన్స్ చూస్తుంటే హ్యాపీడేస్ రోజులు గుర్తొచ్చాయి. ఆ సినిమా తరువాత వరుసగా ఆరు సినిమాలు చేశాను. అన్ని పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఏ సినిమాను అంగీకరించాలి..? కథను నమ్మే సినిమాను అంగీకరించాలి ..? లాంటివి చెప్పడానికి నాకు గాడ్ ఫాదర్ లేరు. ఆ సమయంలో నాక్కూడా గాడ్ ఫాదర్ ఉంటే బావుండేది అనిపించింది. ఆరు ప్లాపుల తరువాత స్వామిరారా చిత్రంతో హిట్ అందుకున్నాను. అప్పుడు తెల్సింది కథనే అన్నిటికన్నా ముఖ్యమని.. కథలో విషయంలో నాక్కూడా మార్గదర్శకం చేవారు ఉంటే అప్పుడే మంచి సక్సెస్ ను అందుకోనేవాడినేమో ” అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
