NTV Telugu Site icon

Sai Pallavi: తారక్, బన్నీ, చరణ్ ముగ్గురు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే..

Smitha

Smitha

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. డ్యాన్స్ తోనే కాదు నటనతోనూ ఆమె ప్రేక్షకులను కట్టి పడేసింది. గ్లాంనర్ తోనే కాదు కళ్ళతో కూడా అభిమానులను కట్టిపడేయొచ్చు అని చెప్పిన నటీమణుల లిస్టులోకి చేరిపోయింది. లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకొని అందుకు తగ్గట్లుగానే ఎణ్హతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగుతోంది. ఇక గార్గి సినిమా తరువాత సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ ను ఓకే చేసింది లేదు. ప్రస్తుతం ఒక కోలీవుడ్ సినిమా మాత్రమే సాయి పల్లవి చేతిలో ఉంది. సాధారణంగా చాలా రేర్ గా ఆమె ఇంటర్వూస్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత షో లో సందడి చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Phalana Abbayi Phalana Ammayi: విడివిడి రెండు ప్రాణాలిలా.. ముడిపడి ఏకమయ్యాయి ఇలా

ప్రోమో నిమిషం పాటే ఉన్నా ఆసక్తిని రేకెత్తించింది. స్మిత అడిగిన రెండు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆన్సర్ లు ఇచ్చి ఔరా అనిపించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు బన్నీ, తారక్, చరణ్ లతో ఎవరితో డ్యాన్స్ చేయాలని ఉంది అంటే.. ఆ ముగ్గురు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే బావుంటుంది అని నవ్వేసింది. ఇక రెండో ప్రశ్నగా మీటూ ఉద్యమం గురించి స్మిత అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి మాట్లాడుతూ.. “మీటూ అంటే కేవలం చేతులతో చేసేది మాత్రమే కాదు.. ఒక వ్యక్తిని మాటలతో వేధించినా కూడా అది అబ్యూసే అవుతోంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్న ప్రోమోతోనే ఎపిసోడ్ మొత్తంపై ఆసక్తిని పెంచేసింది స్మిత. మరి పూర్తి ఎపిసోడ్ లో స్మిత, సాయి పల్లవి దగ్గరనుంచి ఎన్ని నిజాలు రాబట్టిందో చూడాలంటే కొద్దీ సమయం వేచి చూడాల్సిందే.

Show comments