Site icon NTV Telugu

Niharika Konidela: అన్నావదినలతో మెగా డాటర్..

Varun

Varun

Niharika Konidela:మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఈ మధ్యనే భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులిచ్చిన ఆమె.. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. అక్కలు అయిన శ్రీజ, సుస్మితలతో పాటు స్నేహితులతో సమయాన్ని గడుపుతూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక తాజాగా మెగా డాటర్.. లవ్ బర్డ్స్.. మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలతో కాఫీ డేకు వెళ్ళింది. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న విషయం తెల్సిందే.. ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట ప్రస్తుతం షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి వెకేషన్స్ కు, డేట్స్ కు వెళ్తున్నారు. ఈ ఫోటోలను లావణ్య షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.

Abbas: ఆమె నన్ను మోసం చేసింది.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

ఇక తాజాగా వరుణ్- లావణ్య లతో పాటు నిహారిక కూడా మెరిసింది. ఈ ఫోటోలను లావణ్య షేర్ చేస్తూ.. మంచి వాతావరణం.. ఫేవరేట్ పీపుల్ అంటూ క్యాప్షన్ పుట్టుకొచ్చింది. ఇక వదినా ఆడపడుచులు ఇద్దరు ఎంతో అందంగా కనిపించారు. వరుణ్ కు మాత్రమే కాదు నిహారికకు కూడా లావణ్య బెస్ట్ ఫ్రెండ్. ఆమె పెళ్ళిలో సందడి చేసిన ఏకైక హీరోయిన్ లావణ్య మాత్రమే. నిహారిక- లావణ్య జిమ్ మేట్స్ కూడా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే వరుణ్- లావణ్య పెళ్లి త్వరలోనే జరగనుందని సమాచారం.

Exit mobile version