Niharika Konidela: ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.. హోప్ వదలకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వినయ్ రత్నం తెరకెక్కించిన సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తుంది. ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ .వాళ్లకున్న అడ్డులు తొలగించుకుని, వాళ్ళ ఆశలు, ఆశయాలు కోసం పోరాడి వాళ్లకున్న బీడు భూమికి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలులైన ఎదురుకుంటుంది అన్నదానికి నిదర్శనం సాగు. అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో మాధ్యమాల్లో మార్చి 4 నుంచి ‘సాగు’ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సాగు సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
అనంతరం నిహారిక మాట్లాడుతూ.. “సాగు అనే మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. వ్యవసాయధారులకు ఎంతో హోప్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. నా జీవితంలో నాకు ప్రతీ విషయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడున్నారు. 52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని 4 రోజుల్లో షూట్ చేశారుచిత్రీకరించారు. ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్‌కు థాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాల్ని నేను ఎప్పుడూ దగ్గరుండి చూడలేదు. కానీ ఇలాంటి సినిమాను అందరికి ముందు తీసుకు రావడం ఆనందంగా ఉంది. సాగు సినిమాను నేను సమర్పిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లను సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలి” అని చెప్పుకొచ్చింది.
Also Read
- Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!
- The Paradise : 'ది ప్యారడైజ్'కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
- Prabhas - Nbk : ప్రభాస్ ఫౌజీ - బాలయ్య 'దాదా'లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
- Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ.. “మా సినిమాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రాన్ని చూసి మాకు సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. రైతు గురించి చెప్పాలని సాగు తీశాను. ఓ మనిషిని కులం, డబ్బు, సమాజం వంటివి ఆపుతుంటాయి. సమస్య ఎలాంటిది అయినా కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు అనే సందేశాన్ని ఇవ్వాలని తీశాను” అని అన్నారు.
నటుడు వంశీ మాట్లాడుతూ.. “సాగు అనేది మా అందరికీ ఎంతో ప్రత్యేకం. గత ఆరేడేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. నిహారిక గారి వల్లే మా సాగు సినిమా ఇక్కడి వరకు వచ్చింది. సాగు సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్” అని అన్నారు.
హారిక బల్ల మాట్లాడుతూ.. “మా సినిమాకు ఇంత సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. స్లాంగ్ కోసం కష్టపడ్డాం. నాకు ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఇది వరకు చాలా పాత్రలు చేశాను. కానీ ఇంత మంచి గుర్తింపు అయితే రాలేదు. అందుకే ఈ సినిమాలో నటించాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!