Niharika Konidela: వదినమ్మ వచ్చేసింది.. ఆడపడుచు ఫుల్ ఖుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతూ.. కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. నిహారికకు ఆమె అన్న వరుణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి పనిలో సపోర్ట్ గా ఉంటాడు అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. నిహారిక విడాకులు ఇచ్చినప్పుడు కూడా కుటుంబం ఎంతో సపోర్ట్ గా నిలిచింది. ఇక ప్రతి చెల్లి.. అన్న పెళ్లి ఎప్పుడు అవుతుందా .. ? హంగామా ఎప్పుడు చేయాలా.. ? అని ఎదురుచూస్తూ ఉంటుంది. నిహారికకు ఆ సమయం రానే వచ్చింది. నిన్న ఇటలీలో వరుణ్ – లావణ్య పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఆ పెళ్ళిలో ఆడపడుచుదే హడావిడి అంతా. అన్న పెళ్ళిలో తండ్రి నాగబాబుతో కలిసి తీన్మార్ స్టెప్స్ వేసి అలరించింది.
VarunLuv: అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమైనవాడే మిస్ అయ్యాడేంటి.. ?
Also Read
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
- OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
- The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
- Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
ఇక వదిన లావణ్య- నిహారిక.. మొదటి నుంచి ఫ్రెండ్స్ అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. నిహారిక పెళ్ళికి వెళ్లిన ఏకైక హీరోయిన్ లావణ్యనే. అందుకు కారణం కూడా లేకపోలేదు. నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ మరియు జిమ్ పార్ట్నర్స్ .. రీతూ వర్మ, లావణ్య.. అందుకే వీరు నిహా పెళ్ళిలో సందడి చేశారు. ఇక అంతకు ముందు నుంచే అన్న ప్రేమాయణం మొత్తం అమ్మడికి తెలుసని తెలుస్తోంది. ఇక వరుణ్- లావణ్య పెళ్లి కూడా దగ్గరుండి చేసిన నిహారిక.. అన్నా వదినలతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. వదినమ్మ వచ్చేసింది అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వదినా ఆడపడుచులుగా మారిన ఈ ఫ్రెండ్స్ ముందు ముందు ఎలా ఉండనున్నారో చూడాలి.
తాజావార్తలు
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
-
Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
-
Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!