Site icon NTV Telugu

Niharika Konidela: నా ప్రియమైన వారికి ప్రేమ లేఖ.. నిహారిక ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

Niharika Konidela

Niharika Konidela

Niharika Konidela Love Letter: మెగా డాటర్‌ నిహారిక ప్రస్తుతం యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టి.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంటుంది. రీసెంట్‌గా కొత్త ఆఫీసు ఓపెన్‌ చేసిన ఆమె సొంతంగా సినిమాలు సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల ఓ మూవీని కూడా లాంచ్‌ చేసింది. తన అన్నయ్య వరుణ్‌ తేజ్‌ పెళ్లి అనంతరం ఇటలీ నుంచి రాగానే కొత్త సినిమాకు ప్రారంభోత్సవం చేసింది. ఈ మూవీ పూజ కార్యక్రమానికి కొత్త జంట వరుణ్‌-లావణ్యలు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సినిమా ద్వారా ఆమె 15 మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతోంది.

Also Read: Viral Photo: హెల్మెట్ పెట్టుకోమంటే.. ఏం పెట్టుకున్నావ్ బ్రో

ఇదిలా ఉంటే నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విడాకులు అనంతరం సోషల్‌ మీడియా వాడకం పెంచిన ఆమె ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతున్న మూమెంట్స్‌, ఫ్యామిలీతో అల్లరి చేస్తున్న వీడియోలు షేర్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు కూడా ఆమె పోస్ట్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రియమైన వారికి లవ్‌ లేటర్‌ అంటూ ఓ స్పషల్‌ వీడియోను షేర్‌ చేసింది.

Also Read: Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!

ఇంతకి అందులో ఏముందంటే. తన మదర్‌, వదిన లావణ్య త్రిపాఠి, శ్రీజ, సుష్మితలతో పాటు వితిక షేరు.. తన కజిన్స్‌, ఫ్రెండ్స్‌, వెల్‌ విషర్స్‌ అంతా ఉండేలా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. మై ఏంజెల్స్‌ అంటూ వారందరికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా నిహారిక వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. ‘మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో చాలా ప్రత్యేకం. మిమ్మిల్ని ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ నిహారిక ఎమోషనల్‌ అయ్యింది. ఇక ఈ పోస్టు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. వావ్‌.. లవ్‌ నిహారిక.. మా అందరి ప్రేమకు నువ్వు అర్హురాలివి అంటూ కామెంట్‌ చేసింది. అంతేకాదు నెటిజన్లు సైతం ఆమె పోస్టుపై ఆసక్తిగా స్పందిస్తున్నారు.

Exit mobile version