Niharika Konidela: మెగా డాటర్ నిహారిక అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నిండైన చీరకట్టుతో కనిపించి ఔరా అనిపించింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. కాగా, నటనకు గుడ్ బై చెప్తూ అమ్మడు.. చైతన్యు జొన్నలగడ్డను వివాహమాడి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తరువాత నటించకపోయిన నిర్మాతగా కొనసాగుతూ వచ్చింది. హీరోయిన్ గా హిట్ అందుకోలేకపోయినా నిర్మాతగా మంచి హిట్లనే అందుకుంది. ఇక ఇక్కడవరకు బాగానే ఉన్నా .. గత కొన్నిరోజుల నుంచి నిహారిక విడాకుల రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం చై- నిహారిక ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో కావడం, పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని పుకార్లు ఎక్కువ అయ్యాయి. ఈ రూమర్స్ పై అటు మెగా కుటుంబం కానీ, నిహారిక కానీ స్పందించింది లేదు.
Ravi Babu: అవును.. నాకు పూర్ణతో ఎఫైర్ ఉంది.. కానీ
ఇక ఈ విడాకుల రూమర్స్ ను పక్కనపెట్టి నిహారిక అందాల ఆరబోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తాజాగా నిహారిక డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ స్లీవ్ లెస్ టాప్ లో కేక పుట్టించింది. హాట్ అంట్ స్ట్రెయిట్ లుక్ తో అదరగొట్టేసింది. మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తూ అసలు నిహారికానేనా అని అనిపించేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఫోటోషూట్స్ ఎందుకు..? ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది.
